మెగాస్టార్, సూపర్ స్టార్‌‌‌‌లతో తమన్నా

మెగాస్టార్, సూపర్ స్టార్‌‌‌‌లతో తమన్నా

పద్దెనిమిదేళ్ల సినీ కెరీర్‌‌‌‌లో ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్‌‌గా సత్తా చాటుతోంది తమన్నా. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా  ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే మెగాస్టార్, సూపర్ స్టార్‌‌‌‌లతో ఒకేసారి కలిసి నటించడం చాలా ఎక్సయిటింగ్‌‌గా ఉందని చెబుతోంది తమన్నా.  ‘భోళా శంకర్’లో చిరంజీవికి జోడీగా, ‘జైలర్‌‌‌‌’లో రజినీకాంత్‌‌కి జంటగా నటిస్తున్న తమన్నా.. రీసెంట్‌‌గా పలు ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ‘రజినీకాంత్ సర్‌‌‌‌తో కలిసి వర్క్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా కల నిజమైంది. ఆయన్ని సెట్‌‌లో చూసే రోజుకోసం ఎదురు చూశా. అలాగే చిరంజీవి గారితో ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత రెండోసారి నటించే చాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఈగర్‌‌‌‌గా వెయిట్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. ఇక  బాలీవుడ్‌‌ మూవీ ‘బోలే చుడియన్‌‌’లో నటిస్తున్న తమన్నా, మరోవైపు మాలీవుడ్‌‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. దిలీప్‌‌కు జంటగా ‘బాంద్రా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలాగే ఇప్పటికే ‘లెవెన్త్ అవర్’ వెబ్‌‌ సిరీస్‌‌లో నటించిన తమన్నా.. కొన్ని సిరీస్‌‌లకు కూడా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.