Chiranjeevi, Hari: సింగం దర్శకుడితో చిరంజీవి మూవీ.. ఫైనల్ డెసిషన్ ఆయనదే?

Chiranjeevi, Hari: సింగం దర్శకుడితో చిరంజీవి మూవీ.. ఫైనల్ డెసిషన్ ఆయనదే?

యముడు(Yamudu) సినిమాతో అటు తమిళంలో, ఇటు తెలుగులో భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు హరి(Hari). తమిళ స్టార్ సూర్య(Suriya) హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ గా నిలిచింది. సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన ఈ సినిమా ఆయననకి మాస్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసింది. ఈ ఒక్క సినిమాతో దర్శకుడు హరి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్స్ గా సింగం, S3 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

కొంత గ్యాప్ తరువాత హరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రత్నం. స్టార్ హీరో విశాల్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ప్రియా భావాన్ని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు హరి బంపర్ ఆఫర్ కొట్టేశారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. దర్శకుడు హరి ఈ మధ్య చిరంజీవికి ఓ పవర్ఫుల్ కథను వినిపించాడట. హరి స్టైలాఫ్ స్క్రీన్ ప్లేతో సాగిన ఆ కథ చిరంజీవికి బాగా నచ్చిందట. అయితే ఈ సినిమాకు ఒకే చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడట మెగాస్టార్. 

కారణం.. ఈ మధ్య తమిళ దర్శకులు తెలుగులో చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ అవలేదు. వాటిలో.. లింగుస్వామి వారియర్, మురుగదాస్ స్పైడర్, వెంకట్ ప్రభు కస్టడీ సినిమాలున్నాయి. అందుకే హరితో సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నాడట చిరంజీవి. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో చిరుదే ఫైనల్ డెసిషన్ గా మారింది. మరోపక్క టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా చిరుతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ ఇద్దరిలో ఏ దర్శకుడితో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.