తెలుగు గంగ నుంచి  చెన్నైకి తాగునీళ్లివ్వండి..చంద్రబాబుకు తమిళనాడు సీఎం విజయ్ రిక్వెస్ట్

తెలుగు గంగ నుంచి  చెన్నైకి తాగునీళ్లివ్వండి..చంద్రబాబుకు తమిళనాడు సీఎం విజయ్ రిక్వెస్ట్
  • ఏపీ సీఎం చంద్రబాబుకు తమిళనాడు సీఎం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజ్ఞప్తి
  • ఇప్పటికే 4.08 టీఎంసీలు ఇచ్చాం
  • నీటి లభ్యత, అవసరాలకు తగ్గట్టుగా మరికొంత నీటిని రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామన్న బాబు  

 

హైదరాబాద్​, వెలుగు:  తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాను పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబును తమిళనాడు సీఎం విజయ్​ కోరారు. ఈ ఏడాది ఇప్పటికే చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేశామని, ఎల్‌‌నినో ప్రభావంతో కృష్ణా జలాలు తగ్గినా చెన్నై దాహం తీర్చేందుకు సానుకూలంగా ఉన్నామని చంద్రబాబు సమాధానమిచ్చారు.

నీటి లభ్యత, అవసరాలకు తగ్గట్టుగా మరికొంత నీటిని విడుదల చేయడంపైనా ఆలోచన చేస్తామని చెప్పారు. మంగళవారం ఏపీలోని విజయవాడలో చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్​ భేటీ అయ్యారు. విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు క్యాంప్​ ఆఫీసులో చంద్రబాబు, లోకేశ్​ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోదావరి-–కావేరి లింక్​పై ఇద్దరు సీఎంలు చర్చించారు. గోదావరి-–కావేరిని అనుసంధానం చేయాలని, అది ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని చెప్పారు.  నదుల అనుసంధానంతోనే కరువుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని  చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమిళనాడు అభివృద్ధికి విజయ్‌‌ కృషి చేస్తున్నారని కొనియాడారు.