సపోర్ట్ చేస్తే ట్రోల్స్ చేస్తారా.. ఏం మనుషులురా బాబు!

సపోర్ట్ చేస్తే ట్రోల్స్ చేస్తారా.. ఏం మనుషులురా బాబు!

ప్రస్తుతం త‌మిళనాట హీరోయిన్ త్రిష(Trisha) ఇష్యూ సంచలనంగా మారింది. సీనియ‌ర్ న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ చేసిన(Mansoor alikhan) త్రిషపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. లియో మూవీ త్రిష‌తో త‌న‌కు కాంబినేష‌న్ సీన్లు లేక‌పోవ‌డంతో అసంతృప్తి వ్య‌క్తం చేసిన నటుడు మ‌న్సూర్ అలీఖాన్.. ఆమెతో రేప్ సీన్ ఉంటుంద‌ని ఆశపడ్డానని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీంతో మ‌న్సూర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  

త్రిష‌, లేవు దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్ తో సహా.. చాలా మంది ప్ర‌ముఖులు ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇక టాలీవుడ్ నుండి హీరో నితిన్‌ ముందుగా స్పదించారు. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేరారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. మ‌న్సూర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. త్రిష‌కు సపోర్ట్ గా మాట్లాడారు.     

అయితే.. ఈ విషయంపై మ‌న్సూర్ అలీఖాన్ మద్దతుదారులు చిరుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ సందర్బంగా కొన్ని సినిమా ఈవెంట్ల‌లో చిరంజీవి హీరోయిన్ల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరుపై కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య మూవీ ఈవెంట్లో పూజా హెగ్డే, భోళా శంక‌ర్ ఈవెంట్లో కీర్తి సురేష్‌తో చిరు వ్యవహరించిన తీరు కొంచెం స‌ర‌దాగా ఉంటుంది. ఆ వీడియోలకి చిరు ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. మరోపక్క మెగా ఫ్యాన్స్ ఆ కామెంట్స్ ను తప్పుబడుతున్నారు. చిరు స‌ర‌దాగా చేసిందానికి, మ‌న్సూర్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ తో కంపేర్ చేయడం కరక్ట్ కాదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది.