బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత.. ? తమిళనాట జోరుగా ప్రచారం...!

బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత.. ? తమిళనాట జోరుగా ప్రచారం...!

తమిళ స్టార్ హీరో, టీవీకే (TVK) పార్టీ అధినేత తమిళ్ నాడు సీఎం విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని చెన్నై రాజకీయ వర్గాల్లో బలంగా టాక్ నడుస్తోంది.

అయితే, ఈ విషయంపై సంగీత కానీ, బీజేపీ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ విజయ్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఈ ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి.

మళ్లీ వార్తల్లోకి సంగీత  
గత కొన్నాళ్లుగా విజయ్, సంగీత మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారిద్దరూ విడిపోయారనే  రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వీరి కుటుంబ సమస్యల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.

విజయ్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫంక్షన్లకు, ప్రోగ్రామ్స్‌కు సంగీతతో పాటు ఆమె పిల్లలు కూడా రాకపోవడంతో వీరిద్దరూ విడిపోయారనే వార్తలకు మరింత బలం చేకూరింది.

బీజేపీ కొత్త ప్లాన్ 
సంగీతను బీజేపీలోకి తీసుకురావడానికి నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారంటూ... జోరుగా ప్రచారం జరుగుతుంది.  ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న ఒక స్టార్ నటి, సంగీతను ఒప్పించడానికి తెరవెనుక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విజయ్‌  భార్య   సంగీత  ప్రత్యర్థి పార్టీ బీజేపీలో చేరితే, అది తమిళనాడు రాజకీయాల్లో దళపతి ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంగీత స్వర్ణలింగం బ్యాక్‌గ్రౌండ్ 
సంగీత శ్రీలంకకు చెందిన ఒక తమిళ బిజినెస్ ఫ్యామిలీ అమ్మాయి.  వారి కుటుంబం లండన్‌లో సెటిల్ అయింది. మొదట విజయ్‌కు పెద్ద అభిమాని అయిన సంగీత, ఆ తర్వాత ఆయనతో పరిచయం పెంచుకున్నారు. అది ప్రేమగా మారి 1999లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంగీత బీజేపీ ఎంట్రీపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ, రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న విజయ్‌ను చిక్కుల్లో పెట్టడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.