సముద్రం మధ్యలో తండేల్ షూటింగ్ 

సముద్రం మధ్యలో తండేల్ షూటింగ్ 

నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్. చందూ మొండేటి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని మల్పే పోర్ట్ (ఉడిపి)లో షూటింగ్ మొదలు పెట్టగా, కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్స్‌‌‌‌ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం సముద్రం మధ్యలో అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్స్‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా టీమ్ షేర్ చేసిన ఫోటోలో నాగ చైతన్య సముద్రం వైపు నడుస్తూ వెనుక నుంచి ఆనందంగా కనిపిస్తున్నాడు.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ అని.. త్వరలోనే మరికొన్ని ఎక్సయిటింగ్ అప్‌‌‌‌డేట్‌‌‌‌లతో రానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.