బంజారాహిల్స్ లో ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసుల దాడులు..

బంజారాహిల్స్ లో ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసుల దాడులు..

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. మే 4వ తేదీ శనివారం అర్థరాత్రి ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసులు రైడ్స్ నిర్వహించారు.  ఎలక్షన్ కోడ్ ఉన్నా.. అర్ధరాత్రి వరకు బార్, పబ్ నను నిర్వహిస్తున్నారని... నిబంధనలకు విరుద్ధంగా పబ్ ను నడిపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసులు దాడులు చేశారు. 

పబ్ లో డాన్స్ చేస్తున్న యువతీ యువకులను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు.. వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేపిస్తున్నట్లు తెలుస్తోంది.  పబ్బు పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.