నగరి: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ ఛైర్మన్ స్థానం ఏకగ్రీవమైంది. వైసీపీ మాజీ మంత్రి రోజా ఇలాఖాలో టీడీపీ జెండా ఎగిరింది. నగరి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. నగరి మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీ అభ్యర్థి 'శ్రీనివాసన్' ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం గమనార్హం. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి ఇర్ఫాన్ బాషా నామినేషన్ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.
కడప జిల్లా ప్రొద్దటూరు మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బైఠాయించారు. తమ అభ్యర్థులను లోపలికి పంపాలంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆ పార్టీ ఛైర్మన్ అభ్యర్థి నరసింహారెడ్డి నిరసన తెలిపారు. వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించి.. టీడీపీ నాయకులు అక్రమ మార్గంలో ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్ర పన్నారని రాచమల్లు ఆరోపించారు.
