KL Rahul: వైస్ కెప్టెన్ కాకపోతే ఏంటీ..? కేఎల్ రాహుల్ కే మా మద్దతు:రోహిత్ శర్మ

KL Rahul: వైస్ కెప్టెన్ కాకపోతే ఏంటీ..? కేఎల్ రాహుల్ కే మా మద్దతు:రోహిత్  శర్మ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో కేఎల్ రాహుల్కు తమ మద్దతు ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఫామ్లో లేక ఆటగాడు కష్టాల్లో ఉంటే..అతనిలో సత్తాను బట్టి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. తమ సత్తాను నిరూపించుకునేందుకు అలాంటి వాళ్లకు సమయం ఇవ్వాలని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 

వైస్ కెప్టెన్ కాకపోతే ఏంటీ..?

వైస్ కెప్టెన్‌గా ఉన్నా..లేకపోయినా ప్లేయర్ స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదని రోహిత్ శర్మ చెప్పాడు. వైస్ కెప్టెన్‌గా ఉన్నాడంటే అప్పటికి జట్టులో అతనే అందరి కన్నా సీనియర్ అయ్యుంటాడని..అయితే ఆ పదవి తీసేసినా ఏమీ మారదన్నాడు. గిల్, కేఎల్ ఇద్దరూ కూడా మ్యాచ్‌కు ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారని...అది వాళ్లకు అలవాటే..అని రోహిత్ శర్మ తెలిపాడు. 

మ్యాచ్కు ముందు తుది జట్టుపై నిర్ణయం

మూడో టెస్టులో తుది జట్టులో ఎవరు స్థానం దక్కించుకుంటారో తెలియదని రోహిత్ శర్మ అన్నాడు. అయితే పదకొండు మంది గురించి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెప్పాడు. టాస్ వేసే సమయంలోనే దీనిపై క్లారీటి వస్తుందన్నాడు. అప్పుడే తుది జట్టును ప్రకటిస్తామని వెల్లడించాడు. 


వైస్ కెప్టెన్ తొలగింపు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను సెలెక్టర్లు తొలగించారు. దీంతో అతన్ని మూడో టెస్టులో  ఆడించడం లేదని..గిల్‌ను తీసుకోవడానికే రాహుల్‌ను ఈ పదవి నుంచి తప్పించారని వార్తలు వినిపించాయి. దీనికి తోడు మూడో టెస్టుకు ముందు నెట్స్‌లో గిల్ సుదీర్ఘ సమయం ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో రాహుల్‌ను పక్కన పెడుతున్నారని..అందుకే గిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడన్న వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా వీటన్నింటిపై రోహిత్ శర్మ స్పందించాడు.