వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఐదో ర్యాంక్‌‌కు టీమిండియా

వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఐదో ర్యాంక్‌‌కు టీమిండియా

సెంచూరియన్‌‌: సౌతాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడిన టీమిండియాకు.. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) 2023-–25 పాయింట్ల పట్టికలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాప్‌‌ ప్లేస్‌‌తో సిరీస్‌‌ను మొదలుపెట్టిన రోహిత్‌‌సేన ఒకే ఒక్క ఓటమితో ఐదో ప్లేస్‌‌కు పడిపోయింది. 

ప్రస్తుతం ఇండియా ఖాతాలో 44.44 పీసీటీ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో సౌతాఫ్రికా 100 పీసీటీ పాయింట్లతో నంబర్‌‌వన్‌‌లోకి దూసుకొచ్చింది. పాకిస్తాన్‌‌ (61.11), న్యూజిలాండ్‌‌ (50), బంగ్లాదేశ్‌‌ (50) వరుసగా రెండు నుంచి 4వ ర్యాంక్‌‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్‌‌ (16.67), ఇంగ్లండ్‌‌ (15), శ్రీలంక (0) వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో ఉన్నాయి.