Bobby Deol NBK109: బాలయ్య మూవీలో బాబీడియోల్..బిగ్ స్క్రీన్లో వార్ షురూ

Bobby Deol NBK109: బాలయ్య మూవీలో బాబీడియోల్..బిగ్ స్క్రీన్లో వార్ షురూ

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య..తన తరువాత సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

NBK109 మూవీలో విలన్గా యానిమల్ విలన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. లేటెస్ట్గా మేకర్స్ ఇవాళ బాబీ డియోల్(Bobby Deol) బర్త్డే స్పెషల్గా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. జన్మదిన శుభాకాంక్షలు సార్, మా NBK109లో బిగ్ స్క్రీన్స్‌లో నట సింహం నందమూరి బాలకృష్ణ గారితో..మిమ్మల్ని మీరు ఆవిష్కరించడం కోసం వేచి చూడలేకపోతున్నాను..అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశాడు. 

రీసెంట్గానే బాబీ డియోల్ ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, బాబీడియోల్ మధ్య వచ్చే యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ పోటాపోటీగా ఉండబోతున్నాయని సమాచారం. బాలీవుడ్లో హీరోగా చేస్తూనే..క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ..ప్రెజెంట్ మోస్ట్ వైలెంట్ విలన్గా పేరు తెచ్చుకున్నారు బాబీ డియోల్.

యానిమల్ మూవీలో బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాబీ డియోల్ తన స్టైలిష్ లుక్స్తో పాటు మోస్ట్ వైలెంట్ విలన్గా అదరగొట్టేసాడు. యానిమల్ సక్సెస్తో మంచి జోష్లో ఉన్న బాబి డియోల్కి సౌత్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువ' మూవీలో కూడా విలన్ రోల్ చేస్తున్నారు.

 NBK 109లో బాలయ్య సరసన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.