బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట రెచ్చిపోయారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా నల్ల చొక్కాలు, ఆ చొక్కాలపై నిరసనల స్లోగన్స్ ఉండటాన్ని గుర్తించిన.. అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు దగ్గర నిలిపివేశారు. అసెంబ్లీలోకి ఇలాంటి నిరసనలతో వచ్చే అవకాశం లేదని.. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయని పోలీసులు స్పష్టంగా చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెచ్చిపోయారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా పోలీసులపై చేయి చేసుకున్నారు. ‘‘ఇట్లనేనా కొట్టేది.. సర్వీస్లో ఉంటవా..?’’ అని ఒక పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీస్ గల్లా పట్టి దుర్భాషలాడారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
‘‘మేం వస్తేనే మీకు బత్కుదెర్వు.. సిగ్గు లేదు’’ అని కేటీఆర్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. అసెంబ్లీ లోపలికి స్లోగన్స్ రాసి ఉన్న నల్ల టీషర్టులతో అనుమతించేది లేదని పోలీసులు చెప్పిన వెంటనే హరీష్ రావు టీ షర్ట్ తీసేసి ఇప్పుడు అనుమతించాలని నానా రచ్చ చేశారు.
#WATCH | Hyderabad, Telangana | Tempers flare outside the Telangana State Assembly after BRS leaders, including Working President KT Rama Rao, MLA Harish Rao and others, were stopped by police while protesting against the state government.
— ANI (@ANI) September 7, 2026
They had come to attend the Assembly… pic.twitter.com/XLwaKILAc4
చొక్కా లేకుండా ఎలా అనుమతిస్తామని పోలీసులు అడిగినా హరీష్ రావు వినిపించుకోలేదు. పరిస్థితి అదుపు తప్పడంతో కేటీఆర్, హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అసెంబ్లీలో అడుగుపెట్టకుండానే అసెంబ్లీ బయటనే బీఆర్ఎస్ నేతలు హైడ్రామా సృష్టించారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
