డిప్రెషన్లో కేసీఆర్.. వెంటిలేటర్పై కాంగ్రెస్ : తరుణ్ చుగ్

డిప్రెషన్లో కేసీఆర్.. వెంటిలేటర్పై కాంగ్రెస్ : తరుణ్ చుగ్

కేసీఆర్ డిప్రెషన్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్పై ఉందని  బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ టీం అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కలలు కనేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ, అవినీతి, రైతు, నిరుద్యోగ వ్యతిరేక పాలనని చుగ్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్న ఆయన.. ప్రధాని మోడీ నేతృత్వంలో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.