రాత్రి భోజనం చేసి వాకింగ్ చేస్తుండగా గుండెపోటు..అమెరికాలో తెలంగాణ మహిళ మృతి

రాత్రి భోజనం చేసి వాకింగ్ చేస్తుండగా గుండెపోటు..అమెరికాలో తెలంగాణ మహిళ మృతి

అమెరికాలో తెలంగాణ యువతి ఆకస్మిక మృతి కలకలం రేపుతోంది. న్యూయార్క్ లోని  అల్బనీలో నివాసం ఉంటున్న  అక్షిత అనే యువతి రాత్రి భోజనం అనంతరం వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన  ఆమె సోదరుడు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలు  తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త నల్లమల ఆనంద్ కుమార్తెగా గుర్తించారు. అక్షిత ఆకస్మిక మృతిలో ఆమె కుటుంబంలో  తీవ్ర విషాదం నెలకొంది. అక్షిత మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.  

శుక్రవారం(అక్టోబర్23) రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి ఆవరణలో నడుస్తుండగా 25ఏళ్ల అక్షిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నేలపై పడిపోయిన ఆమెను గమనించిన సోదరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. 

న్యూయార్క్ లోని అల్బనీలో  సోదరుడితో కలిసి నివసిస్తోంది. ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత.. ఇటీవల జాబ్ అపాయింట్ మెంట్ పొందారు. జాబ్ జాయిన్ కావాల్సిన టైంలో ఆమె మృతిచెందిన ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  తెలంగాణలోని ఖమ్మం ఆమె స్వస్థలం. అంత్యక్రియల కోసం ఆమె పార్థివదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.