CM రేవంత్ రెడ్డికి నచ్చేసిన సలార్ పాట.. వైరల్ అవుతున్న ముఖ్యమంత్రి ట్వీట్

CM రేవంత్ రెడ్డికి నచ్చేసిన సలార్ పాట.. వైరల్ అవుతున్న ముఖ్యమంత్రి ట్వీట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy)కి సలార్(Salaar) సినిమా పాట, ఆ పాటలోని పదాలు తెగ నచ్చేశాయట. ఎంతలా అంటే.. ఆ పాటలోని పదాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసేంతలా. అవును సలార్ సినిమాలోనే సూరీడే గొడుగుపెట్టి అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఎమోషనల్ గా సాగే ఈ పాటలోని పదాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ప్రముఖ రచయిత కేకే రాసిన ఆ పాటలోని పదాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.

ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే

ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.

సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే#HaiTaiyarHum #Congress #Nagpur pic.twitter.com/kJBSShjC8j

— Revanth Reddy (@revanth_anumula) December 29, 2023

తాజాగా ఈ పాటలోని.. వేగమొకడు… త్యాగమొకడు.. గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన..  ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే. సైగ ఒకరు.. సైన్యం ఒకరు.. కలిసి కదిలితే కదనమే.. అనే పదాలను తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలిజేసేలా ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆ వీడియోకు బ్యాగ్రౌండ్‌ గా సలార్ పాటను పెట్టడం విశేషం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.