స్క్రాప్ ఆటోలకు ఫిట్ నెస్ అవసరం లేదు.. నిబంధనను సడలించిన ప్రభుత్వం

స్క్రాప్ ఆటోలకు ఫిట్ నెస్ అవసరం లేదు.. నిబంధనను సడలించిన ప్రభుత్వం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఓఆర్ఆర్​పరిధిలోని ఆటోల ఓనర్లు ఇక నుంచి ఆటోల స్క్రాప్​కు ఫిట్​నెస్​సర్టిఫికెట్​పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రాప్ చేసేప్పుడు రెన్యువల్ లేకుండానే పర్మిట్ బదిలీకి అనుమతించనున్నారు. పాత ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ, సీఎన్‌‌‌‌‌‌‌‌జీ ఆటో-రిక్షాలను ఓనర్లు స్క్రాప్ చేసి అదే పర్మిట్‌‌‌‌‌‌‌‌పై కొత్త ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ, సీఎన్‌‌‌‌‌‌‌‌జీ, ఎలక్ట్రిక్ ఆటోలను కొనుక్కోవచ్చు. 

ఇంతకుముందు సీఎఫ్ఎస్టీ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ప్రకారం రిజిస్ట్రేషన్, పర్మిట్ బదిలీ చేయాలంటే స్క్రాప్​చేసే వాహనానికి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి ఉండేది. ఇది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిబంధనను సడలించింది. 

ఇక నుంచి ఓఆర్ఆర్ పరిధిలోని పాత ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ,సీఎన్‌‌‌‌‌‌‌‌జీ ఆటో-రిక్షాల యాజమానులు పర్మిట్ బదిలీని ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్​ చేయకుండానే అనుమతిస్తారు. అయితే, బదిలీ పొందిన వ్యక్తి వాహనాన్ని రోడ్డుపై నడపబోమని, బదిలీ తేదీ నుంచి 3 నెలల్లోపు స్క్రాప్ చేస్తామని అండర్‌‌‌‌‌‌‌‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.