యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. డార్క్, స్టైలిష్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ‘టాక్సిక్’ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ అయ్యాయి. ప్రభుత్వం నుంచి జీవో విడుదలైన కొద్దిసేపటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో యష్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
తెలంగాణాలో టికెట్ ధర ఎంతంటే?
ఆగస్టు 25న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు 10 రోజుల పాటు తెలంగాణలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.100 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ పెంపు GSTతో కలిపి వర్తించనుంది.
దీంతో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలను బట్టి డే 1 నుంచి డే 10 వరకు సింగిల్ స్క్రీన్లలో గరిష్ఠంగా రూ.227 వరకు, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.395 వరకు టికెట్ ధరలు ఉండనున్నాయి. పదో రోజు తర్వాత అంటే సెప్టెంబర్ 5 నుంచి సింగిల్ స్క్రీన్లలో రూ.177, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.295 వరకు టికెట్ ధరలు కొనసాగనున్నాయి.
తెలంగాణలో ‘టాక్సిక్’ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడంతో తెలంగాణలో ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మార్గం సుగమమైంది.
The Tickets to the Fairy Tale are NOW OPEN across AP & Telangana!🔥🔥🔥
— KVN Productions (@KvnProductions) August 25, 2026
Grab your seats and get ready to enter the world of #ToxicTheMovie! 🎟️💥https://t.co/i6ZH4CSrji#Toxic: A Fairy Tale for Grown-Ups Grand Release Tomorrow.#ToxicOn26thAug
AP-TG Release by @SVCRelease… pic.twitter.com/9PYzpPonc5
రేట్లు పెంపు. షరతులు వర్తిస్తాయి..
అయితే ప్రభుత్వం కొన్ని షరతులను కూడా విధించింది. చిత్ర నిర్మాణ సంస్థ KVN – Monster Mind Creations LLP తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి రూ.1 కోటి విరాళంగా అందించాల్సి ఉంటుంది. అలాగే మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాల దుష్ప్రభావాలపై థియేటర్లలో అవగాహన కల్పించే ప్రకటనలను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.
భారీ అంచనాలతో వస్తున్న ‘టాక్సిక్’లో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది.
Telangana Toxic Prices:
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 25, 2026
Day1-10
Single Screens upto ₹227
Plexes & Special Theatres upto ₹395
Day11-
Singles ₹177
Plexes & SPT ₹295 pic.twitter.com/sd1tzcaJI7
