జూబ్లీహిల్స్ లో హైరైజ్ బిల్డింగ్.. భవనం ఎత్తును 30 మీటర్ల వరకు.. అనుమతిస్తూ సర్కారు జీవో

జూబ్లీహిల్స్ లో హైరైజ్ బిల్డింగ్.. భవనం ఎత్తును 30 మీటర్ల వరకు.. అనుమతిస్తూ సర్కారు జీవో

హైదరాబాద్​సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ప్లాట్ నంబర్లు 270-కె, 270-ఎల్, 270-ఎంలల్లో కమర్షియల్ హైరైజ్ భవన నిర్మాణానికి  ప్రభుత్వం ప్రత్యేక సడలింపులతో అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం జీవో 205 జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం భవనం ఎత్తును 30 మీటర్ల వరకు అనుమతించడంతో పాటు, టీడీఆర్​ద్వారా అదనంగా రెండు అంతస్తులు నిర్మించుకునే అవకాశం కల్పించింది. 

అలాగే పర్యావరణ డెక్ ఫ్లోర్, రెండు మీటర్ల వరకు కవర్డ్ బాల్కనీలు, రూల్స్​మేరకు సెట్‌‌‌‌బ్యాక్ సడలింపులకు కూడా అనుమతిచ్చింది. రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని ఉచితంగా అప్పగించేందుకు దరఖాస్తుదారులు అంగీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరికి ఈ సడలింపులు వచ్చినట్లు పేర్కొంది.