కాకా ఫ్యామిలీని శత్రువులు కూడా విమర్శించలేరు

కాకా ఫ్యామిలీని శత్రువులు కూడా విమర్శించలేరు

చెన్నూరులో మార్పు తెలంగాణలో అధికారాన్ని మార్చబోతుందన్నారు జర్నలిస్టు విఠల్.  చెన్నూరు చిన్న ఊరు కాదని.. వివేక్ వెంకటస్వామి గెలుపు ద్వార  కాంగ్రెస్ ను  తీసుకరాబోతున్న ఊరన్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు.  చెన్నూరులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన.. ఇక్కడి ప్రజల గుండెల్లో  కాకావెంకటస్వామి ఉన్నారని తెలిపారు. తెలంగాణ కోసం సీడబ్ల్యూసీ సమావేశంలో గళం విప్పిన పోరాట యోధుడు కాకా అని కొనియాడారు. కాకా కలలు గన్న స్వాప్నిక తెలంగాణ రావాలంటే వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని కోరారు. కాకా ఫ్యామిలీని శత్రువులు కూడా విమర్శించబోరన్నారు

చెన్నూరులో అక్రమాలు చేయడానికి కేసీఆర్ కుటుంబం నల్లాల ఓదేలును పక్కన పెట్టి బాల్కసుమన్ ను తీసుకొచ్చిందన్నారు.బీఆర్ఎస్,బీజేపీ ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. అబద్ధాలకు యూనివర్శిటీ కేసీఆర్ అని విమర్శించారు.  రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలని.. ఆ సవే చేసే గుణం కాకా కుటుంబానికి ఉందన్నారు.