- లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం
- తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్
బషీర్బాగ్, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో గ్రూప్-–3 పరిధిలోని మాల, ఇతర 26 అనుబంధ కులాలకు న్యాయం జరిగేలా రోస్టర్ పాయింట్లను సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అప్పటివరకు ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని కోరింది. శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్, వర్కింగ్ చైర్మన్లు మంత్రి నరసింహయ్య, బి.శివరాజ్, గంగాధర్ మాట్లాడారు.
ఈ నెల 30లోగా రోస్టర్పాయింట్లను సవరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రోస్టర్విధానంలో మార్పులు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కో చైర్మన్లు చీమాదరి, దాసరి భాస్కర్, నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ నాగటి శివరాజ్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రాజ్తదితరులు పాల్గొన్నారు.
