
తెలంగాణ ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.