మేఘన, ఇషాకు సిల్వర్

మేఘన, ఇషాకు సిల్వర్
  • భాకర్‌‌కు పారిస్ బెర్త్

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్​ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ షూటర్లు సాదుల మేఘన, ఇషా సింగ్​ సిల్వర్​ మెడల్స్​ సాధించారు. శనివారం జరిగిన జూనియర్​ విమెన్స్​ 25 మీటర్ల  పిస్టల్​ టీమ్​ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో మేఘన, తేజస్విని, సిమ్రన్​జీత్​ కౌర్​తో కూడిన ఇండియా 1728 స్కోరుతో రెండో ప్లేస్​తో సిల్వర్​ గెలిచింది.

సీనియర్ విమెన్స్​ టీమ్​ఈవెంట్​లో మను భాకర్​, రిథమ్​తో కలిసి ఇషా సింగ్​ ఇండియాకు మరో సిల్వర్ అందించింది. కాగా, ఇదే కేటగిరీ వ్యక్తిగత విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన మను భాకర్​ పారిస్​ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయింది.