భద్రతే అభివృద్ధికి పునాది..తెలంగాణకు టీజీఎస్పీఎఫ్ రక్షణ కవచం :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రతే అభివృద్ధికి పునాది..తెలంగాణకు టీజీఎస్పీఎఫ్ రక్షణ కవచం :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • 67 కీలక ప్రభుత్వ సంస్థలకు భద్రత అని వ్యాఖ్య
  • 0 అమీన్ పూర్లో తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ఆవిర్భావ వేడుకలు

‎మెదక్/పటాన్​చెరు, వెలుగు: ‎భద్రతే అభివృద్ధికి పునాది అని, రాష్ట్రంలోని కీలక సంస్థలకు రక్షణ కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సేవలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన నైపుణ్యాలు, పని పరిస్థితుల మెరుగుదలపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం 36వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్​ లోని అకాడమీలో రైజింగ్​ డే పరేడ్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా డిప్యూటీ సీఎం హాజరై.. జవాన్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991 అక్టోబర్ 23న ఏర్పాటైన ఈ దళం 36 ఏండ్లలో విశిష్ట సంస్థగా ఎదిగిందన్నారు. తెలంగాణ సెక్రటేరియెట్, అసెంబ్లీ, హైకోర్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక సంస్థలతో సహా మొత్తం 67 ముఖ్యమైన సంస్థలకు భద్రత కల్పిస్తోందన్నారు. దాదాపు రెండు వేల మంది సిబ్బంది ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. 

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కీలకం..

యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి వంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యుత్​ఉత్పత్తి నిరంతరాయంగా సాగేలా టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది తోడ్పడుతున్నారని ప్రశంసించారు. గత 35 ఏండ్లలో భద్రతా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆధునిక నిఘా వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ వ్యవస్థలతో అనుసంధానమైన భౌతిక మౌలిక సదుపాయాలు కొత్త సవాళ్లను తీసుకొస్తున్నాయని చెప్పారు. భవిష్యత్​లో శారీరక దృఢత్వంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, అప్రమత్తత, వేగంగా స్పందించే సామర్థ్యం కూడా భద్రతా సిబ్బందికి అవసరమని వివరించారు. 

‎భద్రతా వ్యవస్థల బలాన్ని ఆయుధాలతో మాత్రమే కొలవలేమని, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత ప్రవర్తనతోనే అంచనా వేయాలని సూచించారు. 'మీరు కాపాడేది కేవలం భవనాలను కాదు.. ప్రజల విశ్వాసాన్ని. మీరు రక్షించేది కేవలం సంస్థలను కాదు.. తెలంగాణ ప్రగతిని' అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి షికా గోయల్, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీఎఫ్ వ్యవస్థాపక డీజీ (రిటైర్డ్) స్వర్ణజిత్​ సేన్​, అధికారులు పాల్గొన్నారు.