
4సూర్యాపేట, వెలుగు : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు.
నాలుగో తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 16 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల బాలబాలికలు మండల విద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. http://tgss.telangana.gov.in వెబ్సైట్ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి. రాంబాబు, డీఈవో అశోక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.