హైదరాబాద్: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం (జులై 13) మధ్యాహ్నాం 2.30 గంటలకు విద్యాశాఖ శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ టెట్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో https://tgtet.aptonline.in అనే వెబ్ సైట్లోకి లాగిన్ అయి తమ స్కోర్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. 2026, జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో టెట్ పరీక్షలు జరిగాయని తెలిపారు. మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,15,028 మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.
టెట్‌లో మొత్తం 50, 544 (43.94%) మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లకు జులై 21న కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇకపై సంవత్సరంలో మొత్తం నాలుగు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని.. అందులో ఇన్ సర్వీస్ టీచర్లకు 2, సాధారణ అభ్యర్థులకు రెండు సార్లు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
