కోలీవుడ్ బ్యూటీ త్రిష ఎక్కడ ఉంటే అక్కడ సెన్సేషనే.. లేటెస్ట్ గా శుక్రవారం విడుదలైన తమిళ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చూసేందుకు ఈ చెన్నై బ్యూటీ రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్‌కు వెళ్లారు. సూర్య సరసన త్రిష నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఆమె బయటకు వస్తుండగా.. థియేటర్ బయట ఊహించని క్రేజీ సీన్ ఒకటి రిపీట్ అయింది.
విజయ్‌ని అడిగానని చెప్పండి..
త్రిషను చూడగానే అభిమానులు ఒక్కసారిగా ఆమె కారును చుట్టుముట్టారు. ఆ హడావుడిలో గుంపులో నుంచి ఒక ఫ్యాన్ గట్టిగా.. "మేము అడిగామని దళపతి విజయ్ (CM Vijay) కి చెప్పండి" అంటూ గట్టిగా అరవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఆ మాట వినగానే త్రిష ఒక్క క్షణం షాక్‌కు గురై.. ఆ తర్వాత ఆపుకోలేక ముఖం దాచుకుంటూ తెగ మురిసిపోయింది. ఆ క్యూట్ స్మైల్‌తో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. విజయ్-త్రిషల క్రేజీ బాండింగ్ గురించి నెటిజన్లు మళ్లీ డిస్కషన్స్ మొదలుపెట్టేశారు.
"Thalapathy ah kettenu sollunga"
— Deepu (@deepu_drops) May 15, 2026
Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn
థియేటర్‌లో ఆర్‌జే బాలాజీ హంగామా..!
ఇక ‘కరుప్పు’ స్క్రీనింగ్ సమయంలో థియేటర్ లోపల కూడా ఫుల్ జోష్ కనిపించింది. నటుడు, ఆర్‌జే బాలాజీ ఆడియన్స్‌తో కలిసి సీట్లలో కూర్చొని సినిమా చూస్తూ ప్రతి సీన్‌కు విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు. బాలాజీ ఎగ్జైట్‌మెంట్‌ను చూసి పక్కనే ఉన్న త్రిష నవ్వుకుంటూ, అతడిని శాంతపరచడానికి ఒక లైట్-హార్టెడ్ హగ్ చేసుకోసుకుంది. ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.
కేడీఎం టెన్షన్.. !
సినిమా థియేటర్లలోకి వచ్చే సరికి ఫ్యాన్స్ పండగ చేసుకున్నప్పటికీ.. బ్యాక్‌స్టేజ్‌లో మాత్రం మేకర్స్ భారీ టెన్షన్ ఫేస్ చేశారు. తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ వచ్చినప్పటికీ.. ‘కేడీఎం’ (Key Delivery Message) డిజిటల్ కీస్ ఆలస్యం కావడంతో చాలా చోట్ల షోలు లేట్‌గా పడ్డాయి. ప్రొడ్యూసర్ ఎస్‌ఆర్ ప్రభు థియేటర్ గొడవలను సెటిల్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
మరోవైపు టెక్నికల్ ఎర్రర్ వల్ల ముంబై, పూణే, వారణాసి లాంటి నగరాల్లో సినిమా ముందే ప్లే అయిపోవడంతో పైరసీ భయం పట్టుకుంది. థియేటర్ల నుంచి క్లిప్స్ రికార్డ్ చేసి నెట్‌లో పెట్టవద్దని ప్రొడక్షన్ టీమ్ ప్రేక్షకులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఏదేమైనా.. ‘కరుప్పు’ టాక్ కంటే త్రిష 'బ్లషింగ్' వీడియోనే ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది..
OUR DIRECTOR @RJ_Balaji 🥹🫶#Karuppu #KaruppuBlockbuster
— Karuppu (@KaruppuMovie) May 15, 2026
pic.twitter.com/AponTVfYW9
