తెలుగింటి సంస్కృతికి సూపర్ రెస్పాన్స్

తెలుగింటి సంస్కృతికి సూపర్ రెస్పాన్స్

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో  కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. ప్రశాంతి హారతి దగ్గరే ఆమె కూతురు తాన్య హారతి కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. తాన్య హారతి ప్రధాన పాత్రలో ‘తెలుగింటి సంస్కృతి’ పేరుతో మ్యూజిక్ వీడియోను రూపొందించారు.

దీనికి దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేశారు. కిరణ్ గుడిపూడి ఈ వీడియోలో మరో లీడ్ రోల్ చేశారు. రాధాకృష్ణ హారతి నిర్మాతగా వ్యవహరించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేసిన తెలుగింటి సంస్కృతి  మ్యూజిక్ వీడియో వన్ మిలియన్‌‌కు పైగా వ్యూస్‌‌తో సక్సెస్ అందుకుంది. ఈ సూపర్ రెస్పాన్స్ తమ టీమ్‌‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు.