ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్ధా తెలుగు వెర్షన్ పోస్టర్ రిలీజ్

ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్ధా తెలుగు వెర్షన్ పోస్టర్ రిలీజ్

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హవానే కొనసాగుతోంది. అయితే రీసెంట్ డేస్ లో మళ్లీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు వస్తోన్న చిత్రం ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ ఛద్దా. ఇటీవలే మెగాస్టార్ ఇంట్లో ఆమీర్ ఖాన్ మెగా ప్రివ్యూ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ ప్రివ్యూకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు తన భావోద్వేగాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

ఆమీర్ ని గత కొన్నేళ్ల కితం జపాన్ లో కలిశానన్న ఆయన.. మళ్ళీ ఇప్పుడు ఆమీర్ డ్రీం ప్రాజెక్ట్ లాక్ సింగ్ ఛద్దా స్పెషల్ ప్రీమియర్ కి కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకూ ఆమీర్ నటించిన చిత్రాలన్నింటిలోకెళ్లా ఇది ఒక జెమ్ లాంటి సినిమా అని, సినిమా చాలా బాగుందని కొనియాడారు. అంతే కాకుండా ఆమీర్ కి చిరు తన ఇంట్లోనే శాలువా కప్పి గౌరవపూర్వకంగా సన్మానించారు. అంతే కాకుండా తన ఇంట్లో లాల్ సింగ్ ఛద్దా ప్రత్యేక ప్రివ్యూ ఏర్పాటు చేసిందుకు ఆమీర్‌ఖాన్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ప్రదర్శించడాన్ని తాను చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు ఎమోషనల్ కోట్ ను జత చేశారు. ఆమీర్ ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని.. మెగాస్టార్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాంతో పాటు లాల్ సింగ్ ఛద్దా తెలుగు వెర్షన్ పోస్టర్ చిరు రిలీజ్ చేశారు.