IND vs SA : టాస్ ఓడిన టీమిండియా.. ముందుగా బ్యాటింగ్

IND vs SA  :  టాస్ ఓడిన టీమిండియా.. ముందుగా బ్యాటింగ్

భారత్ తో   జరుగుతోన్న ఫస్ట్ టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. టీమిండియా బ్యాటింగ్ కు దిగింది.  స్టార్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ భారత్ తరపున అరంగేట్రం చేశారు.  

31 ఏండ్ల నిరీక్షణ.. 

మహ్మద్‌‌‌‌‌‌‌‌ అజరుద్దీన్‌‌‌‌‌‌‌‌ (1992) మినహా, సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ (1996), సౌరవ్‌‌‌‌‌‌‌‌ గంగూలీ (2001), రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ (2006–07), ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌ ధోనీ (2010–11, 2013–14), విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (2018–19, 2021–22) నాయకత్వంలోని ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌.. సౌతాఫ్రికాపై టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. కానీ ఇప్పటి వరకు సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయాన్ని మాత్రం అందుకోలేదు.  

ఇక్కడ ఆడిన ఎనిమిది టెస్టు సిరీస్‌ల్లో భారత్‌ ఏడు ఓడి, ఒక్కసారి మాత్రమే (2010-11) డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో 31 ఏండ్లుగా  పోరాడుతున్న ఓ అరుదైన సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయం కోసం ఇప్పుడు టీమిండియా రెడీ అవుతుంటే వర్షం బ్యాడ్ న్యూస్ తో వెల్కమ్ చెప్పింది