నేను నిద్రపోలేదు... కెమెరా యాంగిల్‌ తప్పుగా ఉంది : టెంబా బావుమా

నేను నిద్రపోలేదు...   కెమెరా యాంగిల్‌ తప్పుగా ఉంది : టెంబా బావుమా

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ముందు 2023 అక్టోబర్ 04న  అహ్మదాబాద్‌లో కెప్టెన్స్‌ మీట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీట్‌కు 10 జట్ల కెప్టెన్‌లు హాజరయ్యారు. అయితే ఈ కెప్టెన్సీ మీటింగ్ లో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా నిద్రపోతున్నట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ క్రమంలో దీనిపై  టెంబా బావుమా స్పందించాడు.  

తానేమీ కెప్టెన్సీ మీటింగ్ లో నిద్రపోలేదని,  ఆ ఫోటో తప్పుదోవ పట్టడానికి కారణం కెమెరా యాంగిల్‌ అని టెంబా బావుమా చెప్పాడు. వాస్తవానికి తాను  తల వంచలేదని,  కేవలం కెమెరా యాంగిల్ మాత్రమే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించిందని స్పష్టం చేశాడు.  టెంబా బావుమా ఎంత ఖండించినప్పటికీ నెటిజన్లు మాత్రం అతడు నిద్రపోయాడనే కామెంట్స్ పెడుతున్నారు. 

 కాగా ఇవాళ్టి నుంచి వన్డే వరల్డ్ కప్ మొదలు కానుంది.   తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా తన మొదటి మ్యాచ్ ను  శ్రీలంకతో  అక్టోబర్ 7 శనివారం రోజున ఢిల్లీలో ఆడనుంది.  

ALSO READ | హ్యాట్సాఫ్ గురూ : సోలార్ పవర్ కారు తయారు చేసిన గల్లీ కుర్రోడు