జుట్టు రాలడం ఈ మధ్య చాలామందిని బాధ పెడుతున్న సమస్య పాతికేండ్లలోపు పిల్లల్లో దాదాపు ఇరవై ఐదుశాతం మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. దాంతో పాతికేండ్లకే బట్టతల వచ్చేస్తోంది. ఈ సమస్య అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో లోపం వల్ల జుట్టు ఊడుతూ ఉంటుంది.
వంశ పారంపర్యంగా లేదా వయసు వం వల్ల వచ్చేదాన్ని ఆండ్రో జెనెటిక్ అలోపేషియా అంటారు. ఆహారలోపం, ఒత్తిడి వల్ల వచ్చే దాన్ని బెలిజెన్ ఎఫ్లువయం.. తల పైనే రాకుండా ఇతర అవయవాలలో కూడా జుట్టు రాలితే అలోపేసియా ఏరియేటా అని అంటారు. ఈ సమస్యలకు ట్రీట్మెంట్ ఉంది. కానీ కాలిన, చర్మ వ్యాధుల పల్ల ఊడిపోయిన జుట్టుకు ట్రీట్మెంట్ లేదు అంటున్నారు డాక్టర్లు.
మామూలుగా అయితే జుట్టు కొంత కాలానికి ఊడి కొత్త జుట్టు వస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్లకు రోజులో చాలా జుట్టు ఊడిపోతుంది. కొందరికి తల వెంట్రుకలతో పాటు మీసం. గడ్డం కూడా ఊడుతుంటాయి. ఈ సమస్య ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటారు. ఈ సమస్యను ముందే గుర్తిస్తే డెర్మటాలజిస్ట్ ను కలిసి ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు.
- లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి డైట్ పాలో కావాలి. రోజూ వ్యాయామం చేయాలి. పొగతాగడం మానేయాలి..
- ట్రీట్ మెంట్ లో భాగంగా చెర్మటాలజిస్ట్ రాసిన మందులను రోజూ వాడాలి దాని పల్ల హార్మోనల్ ఇంవాలెన్స్ ఆగిపోయి జుట్టు రాలడం తగ్గుతుంది.
- మెసో, పిఆర్పి (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ) అనే నాన్- ఇన్వేసిన్ థెరపీలు ఉన్నాయి. వీటిలో ఇంజక్షన్ ద్వారా స్కాల్ప్ లోకిమెడిసిన్ పంపుతారు. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
- హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా కూడా జుట్టు పెరిగేలా చేయొచ్చు. కానీ, దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.
