గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టివేత.. మహిళతో పాటు మరో 9 మంది అరెస్ట్

గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టివేత.. మహిళతో పాటు మరో 9 మంది అరెస్ట్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 10 గ్రాముల కొకైన్,10 గ్రాముల MDMA ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బెంగళూర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.