యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026’ను టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. ఈ అవార్డ్స్‌కు జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా నటి ఇంద్రజను నియమించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘జూన్ 13 వరకు ఉచితంగా ఎంట్రీలు స్వీకరించనుండగా, జూన్ 21న హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
దాదాపు 30 కేటగిరీల్లో తొలి ఐదుగురు విజేతలకు అవార్డులు అందజేస్తాం. మొదటి మూడు స్థానాలకు నగదు బహుమతులు ఉంటాయి’ అని అన్నారు. ఈ అవార్డులు కొత్త ప్రతిభావంతులకు మంచి వేదికగా నిలుస్తాయని ఇంద్రజ చెప్పారు. సంగీత దర్శకుడు భోలే శావలి జ్యూరీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
