సివిల్ ఇంజినీర్లకు బంపర్ ఛాన్స్.. తెలంగాణ హెచ్‌బీలో ఏఈ పోస్టులు

సివిల్ ఇంజినీర్లకు బంపర్ ఛాన్స్.. తెలంగాణ హెచ్‌బీలో ఏఈ పోస్టులు

ఇందిరమ్మ ఇండ్లు - అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ పథకంలో భాగంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీజీహెచ్​బీ) అవుట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అక్టోబర్ 8 నుంచి  అక్టోబర్ 21 వరకు అప్లై చేయవచ్చు. 


పోస్టు పేరు: అసిస్టెంట్ఇంజినీర్ (సివిల్). 

మొత్తం ఖాళీలు: 25. 
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్​లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

అభ్యర్థులు మల్టీస్టోర్డ్ రెసిడెన్షియల్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు, పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

వయసు: 2026, జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్​లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 8.

లాస్ట్ డేట్: అక్టోబర్ 21. 

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు తమ నిర్దేశిత విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్​ను  మాత్రమే  పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.tghb.telangana.gov.inను సందర్శించండి.