సీఎంను కలిసిన టీజీఎస్జీడీసీఎఫ్ఎల్  చైర్పర్సన్

సీఎంను కలిసిన టీజీఎస్జీడీసీఎఫ్ఎల్  చైర్పర్సన్

గద్వాల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్ పర్సన్  సరిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పశుసంవర్ధక శాఖ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.