‘గాడ్ ఫాదర్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

‘గాడ్ ఫాదర్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాలో బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఇందులో సల్మాన్, చిరు స్పెషల్ సాంగ్‌ లో స్టెప్పులేశారు. ఈ సాంగ్‌ ప్రోమోను తాజాగా వదిలారు మేకర్స్. స‌ల్మాన్, చిరుపై వ‌చ్చే ఫ‌స్ట్ సింగిల్ ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ ప్రోమోను విడుద‌ల చేశారు. ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. ఈ పాటలో చిరుతో సల్మాన్ చేసిన మాస్ డాన్స్ మూమెంట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమలో హీరో సత్యదేవ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించాడు. ఇందులో చిరుకి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు.