తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇటీవలే తన భార్య సంగీతతో విడాకుల వివాదంలో చిక్కున్న అనంతరం తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు.
తమిళనాడు మరియు పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విజయ్ బెస్ట్ విషెష్ తెలిపారు. పరీక్షలను భయం లేకుండా, ఒత్తిడి లేకుండా, ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు విజయ్ సూచించారు.
ఇవాళ మార్చి 2 నుంచి మార్చి 26 వరకు తమిళనాడులో ఇంటర్ (12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రేపటి సమాజాన్ని నిర్మించబోయే విద్యార్థులు ఉన్నత విద్యలోనూ మెరుగ్గా రాణించాలని విజయ్ కోరారు.
►ALSO READ | Ravi Teja BMW OTT release : ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
“మీరు అందరూ ఈ పరీక్షలను ప్రశాంతంగా ఎదుర్కొనండి. ఉన్నత విద్యలో కూడా మీరు గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాను. మంచి విషయాలే జరుగుతాయి. విజయం ఖాయం” అని విజయ్ తన పోస్టులో పేర్కొన్నారు. విడాకుల వార్తల అనంతరం విజయ్ చేసిన తొలి సోషల్ మీడియా పోస్ట్ ఇదే కావడంతో వైరల్గా మారింది.
தமிழ்நாடு மற்றும் புதுச்சேரியில் 12ஆம் வகுப்புப் பொதுத் தேர்வு எழுதும் என் அன்புத் தம்பிகளுக்கும் தங்கைகளுக்கும் வாழ்த்துகள்.
— TVK Vijay (@TVKVijayHQ) March 2, 2026
நாளைய வளமான சமுதாயத்தை உருவாக்க உள்ள நீங்கள் அனைவரும் இந்தத் தேர்வினைப் பதற்றமின்றி, அச்சமின்றி, துணிவுடன் எதிர்கொள்ளுங்கள். உயர்கல்வியில் சிறந்து…
వ్యక్తిగత జీవితంపై చర్చలు
ఇటీవలే విజయ్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య సంగీత చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 25 ఏళ్ల వైవాహిక జీవితం తిరిగి తెచ్చుకోలేని స్థితికి చేరిందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విజయ్ నుంచి ఈ పోస్ట్ రావడం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్-సంగీత 1998లో యూకేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జన నాయగన్ విడుదల ఆలస్యం:
సంక్రాంతికి రావాల్సిన “జన నాయగన్” మూవీ.. విడుదలపై ఆలస్యం జరుగుతూనే వస్తోంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసులు చుట్టుముట్టడంతో విడుదలపై ఇంకా సందిగ్ధత నెలకొంది. మూడు నెలలు కావొస్తున్నా ఎటువంటి మార్పు లేదని తమిళ సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, ఆ మధ్యలో CBFC సూచించిన కట్స్, మార్పులకు చిత్రబృందం అంగీకరించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. విడుదలపై కొత్త అప్డేట్ రాకపోవడం గమనార్హం!
విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం వెండితెరకు వీడ్కోలు పలుకుతున్న వేళ, ఈ సినిమా ఆయన అభిమానులకు ఒక భావోద్వేగమైన ముగింపు కానుంది. 'జననాయగన్' అంటే ప్రజల నాయకుడు అని అర్థం, ఇది ఆయన రాజకీయ నినాదానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.
