విజయ్ 'జననాయగన్' సంచలన నిర్ణయం.. వందల కోట్ల బిజినెస్ క్యాన్సిల్, డిస్ట్రిబ్యూటర్లకు రిఫండ్!

విజయ్ 'జననాయగన్' సంచలన నిర్ణయం.. వందల కోట్ల బిజినెస్ క్యాన్సిల్, డిస్ట్రిబ్యూటర్లకు రిఫండ్!

కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో, KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చుట్టూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని ఒక సంచలన హైడ్రామా నడుస్తోంది. ఐదు నెలలుగా సెన్సార్ బోర్డు (CBFC) చిక్కుల్లో పడి రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఈ సినిమా విషయంలో హీరో విజయ్ ఒక ఊహించని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.  

డిస్ట్రిబ్యూటర్లకు రిఫండ్..

ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ అగ్రిమెంట్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని విజయ్ ప్రొడక్షన్ హౌస్‌కు ఆర్డర్ వేశారు. బిజినెస్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ట్రేడ్ వర్గాల్లో  హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలని KVN ప్రొడక్షన్స్ నిర్ణయించింది. కేవలం రిలీజ్ డేట్ కోసం డిస్ట్రిబ్యూటర్లను వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఈ రిఫండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లు సంస్థ బిజినెస్ హెడ్ మోహన్ సుప్రీత్ కన్ఫర్మ్ చేశారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే రూ. 8 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ డబ్బులను ప్రేక్షకులకు రిఫండ్ చేసేశారు.

 పైరసీ సెగ.. అరెస్టులు..

ఈ లీగల్ టెన్షన్స్ ఇలా ఉంటే.. ఈ సినిమాకు పైరసీ సెగ గట్టిగా తగిలింది. సినిమాలోని కీలక సీన్స్, ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. లేటెస్ట్ గా ఈ లీకులకు సంబంధించి మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఏప్రిల్‌లోనే ఎడిటింగ్ స్టూడియో నుండి డేటాను దొంగిలించిన ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. 

ALSO READ : ‘పెద్ది’లో ఆంబ్రోస్ క్యారెక్టర్.. కుమ్మేశాడు..

అసలు ఎందుకు ఆగింది?

నిజానికి ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ సినిమాలో సైనిక దళాల ప్రదర్శనపై, కొన్ని మతపరమైన సీన్స్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ వివాదం సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్ వరకు, అక్కడి నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. చివరకు మేకర్స్ కోర్టు పిటిషన్ వెనక్కి తీసుకుని రివైజింగ్ కమిటీకి సినిమాను సబ్మిట్ చేశారు. సినిమాకు థియేట్రికల్ అగ్రిమెంట్లు రద్దు చేసినా.. సినిమాపై విజయ్‌కి ఉన్న నమ్మకం మాత్రం తగ్గలేదు. సెన్సార్ క్లియర్ అయ్యాక ఓన్ రిలీజ్ ద్వారా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను తుఫాన్ సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.