అనీష్, అనస్వర రాజన్ జంటగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. గురువారం ఈ చిత్రం నుంచి ‘యెల్లో చున్ని’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేయడంతోపాటు విశాల్ మిశ్రాతో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. శ్రీజో క్యాచీ లిరిక్స్ రాశాడు. అనీష్, అనస్వర తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
వైజాగ్ గీతం యూనివర్సిటీలో సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అనీష్ మాట్లాడుతూ ‘ఈ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ ఇది. ఒక అమ్మాయి నవ్వితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చెప్పే పాట. మా కొరియోగ్రాఫర్స్ చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. ప్రతి మూమెంట్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను’ అని అన్నాడు. ఇది వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అని, అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ఈ పాట డెడికేట్ చేస్తున్నానని హీరోయిన్ అనస్వర రాజన్ చెప్పింది.
ఈ చిత్రానికి ఆల్రెడీ సక్సెస్ వైబ్ వచ్చిందని డైరెక్టర్ మహేష్ అన్నాడు. తమన్ మాట్లాడుతూ ‘సాధారణంగా ‘ థియేటర్లు, పగిలిపోవాలి, స్పీకర్లు కాలిపోవాలి’ అని నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ మహేష్ వచ్చి ‘గుండె పగిలిపోవాలి’ అని చెప్పాడు. అలాంటి కథలు వచ్చినప్పుడు చాలా ఇంటరెస్ట్ వస్తుంది. కొత్త కంటెంట్‌తో వస్తోన్న డిఫరెంట్ లవ్‌స్టోరీ. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.
