60 ఏళ్ళ వయసులో టామ్‌ క్రూజ్‌లా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

60 ఏళ్ళ వయసులో టామ్‌ క్రూజ్‌లా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. ఇటీవల జీ కర్దా(Jee karda), లస్ట్ స్టోరీస్ 2(Lust Stories2) వంటి బోల్డ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా.. త్వరలో ఇద్దరు బడా హీరోల సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆ హీరోలు మరెవరో కాదు ఒకరు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కాగా.. మరొకరు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirajeevi). 

రజినీకాంత్ హీరోగా వస్తున్న జైలర్(Jailer), చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్(Bhola Shankar). కేవలం ఒక్కరోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలు బక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్నాయి. ఆగస్టు 10న జైలర్, 11న భోళా శంకర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో తమన్నానే హీరోయిన్. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది తమన్నా. 

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన వయసుపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నాతో నటిస్తున్న హీరోల వయసుతో నా వయసు పోల్చడం కరెక్టుగా లేదు. 60 ఏళ్ల వయసులో కూడా టామ్‌ క్రూజ్‌లా విన్యాసాలు చేయాలని, సాసీ డ్యాన్స్‌ చేయాలని అనుకుంటున్నాను. అంతేకాదు.. వరుసగా రజినీకాంత్, చిరంజీవి వంటి గొప్ప  నటులతో సినిమా అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా వుంది అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.