అందుకే నాకు గుర్తింపు రాలేదు.. బాహుబలిపై తమన్నా షాకింగ్ కామెంట్స్

అందుకే నాకు గుర్తింపు రాలేదు.. బాహుబలిపై తమన్నా షాకింగ్ కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన బాహుబలి(Bahubali) సినిమాపై హీరోయిన్ తమన్నా(Thamannaah) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తాజాగా నటిస్తున్న మూవీ లస్ట్ స్టోరీస్2(Lust Stories2). ఈ మూవీ జూన్ 29న ప్రేక్షలకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూవర్ తమన్నాను.. బాహుబలిలో మీరు పోషించిన అవంతిక పాత్రకు అంతగా ఫేమ్ రాకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు అని అడిగింది.

దానికి సమాధానంగా తమన్నా.. "ఆ సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించినా.. క్రెడిట్ అంతగా రాలేదు కానీ.. ప్రభాస్(Prabhas), రానా(rana)కు ఆ క్రెడిట్ దక్కడం మాత్రం న్యాయమే. ఎందుకంటే ఆ సినిమా కోసం వాళ్లిద్దరూ చేసిన దానితో పోలిస్తే నా పాత్ర చాలా తక్కువ. అయినప్పటికీ అలాంటి భారీ సినిమాలో నేను పోషించిన అవంతిక పాత్రకు నాకు లభించిన గుర్తింపునకు అందరికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఆమె మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే. ప్రస్తుతం ఆమె.. మెగాస్టార్(Megsatar) హీరోగా వస్తున్న భోళా శంకర్(Bhola Shankar) సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజనికాంత్(Rajanikanth) ప్రధాన పాత్రలో వస్తున్న జైలర్(Jailar) సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.