థాంక్యూ చెప్పడానికి చైతూ రెడీ

థాంక్యూ చెప్పడానికి చైతూ రెడీ


ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’గా వచ్చిన నాగ చైతన్య త్వరలోనే ‘థాంక్యూ’ చెప్పడానికి రెడీ అవుతున్నాడు. బీవీఎస్ రవి కథ, మాటలు రాసిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు.  ఈ మూవీని కొంత పార్ట్ షూట్ చేసిన తర్వాత ‘బంగార్రాజు’ పూర్తి చేయడం కోసం బ్రేక్ ఇచ్చాడు చైతూ. ఆ సినిమా ఇచ్చిన విజయంతో మరింత జోష్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ‘థాంక్యూ’ షూట్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్ చేశాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి  సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చైతూ త్రీ షేడ్స్ ఉండే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాడు.  రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్స్.   దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతోపాటు  విక్రమ్ కుమార్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లోనే ఓ హారర్ వెబ్  సిరీస్‌‌‌‌‌‌‌‌లో నటించబోతున్నాడు చైతూ. అలాగే  పరశురామ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేయాల్సి ఉంది.