
ఐసీసీ ఈవెంట్లలో సౌతాఫ్రికా రాత మారడం వెనకు న్న ప్రధాన శక్తి ఆ టీమ్ కెప్టెన్ బపూమ అనొచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు.. తన హైట్ తక్కువై నా బూమలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. తను టెస్టు సారథిగా ఎంపికైనప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర య్యాయి.
బాడీ షేమింగ్ కు కూడా గురయ్యాడు. కానీ, వాటిని ఏమాత్రం పట్టించుకోని టెంబా టెస్టు గదతో అందరి నోళ్లు మూయించాడు. లీడర్ గా అతను జట్టును సమర్థవంతంగా నడిపించాడు. కెప్టెన్గా టె స్టుల్లో టెంబాకు ఓటమి లేకపోవడం తన నాయకత్వ పటిమకు నిదర్శనం. జట్టుపై పట్టు, ఆటపై స్పష్టత ఉన్న లీడర్ గా టెంబా క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతం గా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు.
తోటి ఆటగాళ్ల నుంచి తనకు కావాల్సింది. అతను పక్కాగా రాబట్టాడు. ఒకప్పుడు వర్ణ వివక్ష కారణంగా ఐసీసీ వేటు ఎదు ర్కొన్న సౌతాఫ్రికాకు నల్లజాతి క్రికెటర్ ఇప్పుడు క్రికెట్ లో అత్యుత్తమ ఫార్మా ట్ ట్రోఫీ అందించడం నిజంగా గొప్ప విషయం. టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతి సౌతాఫ్రికా ఆటగాడి గా, జట్టుకు నాయకత్వం వహించిన తొలి నల్లజాతి కెప్టెన్గా ఇప్పటికే రికార్డు సృష్టించిన బవూమ ఇప్పుడు సఫారీలను వరల్డ్ టెస్ట్ చాంపియన్గా నిలిపిన వ్యక్తిగా మరో చరిత్ర సృష్టించాడు.