రాష్ట్రాలకు మరికొన్ని వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేంద్రం

రాష్ట్రాలకు మరికొన్ని వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేంద్రం
  • కొనసాగుతున్న కేంద్రం వ్యాక్సిన్ల సరఫరా
  • మరో మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్లు 

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా తెలంగాణకు కూడా వ్యాక్సిన్ల సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా వ్యాక్సిన్లను వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సరఫరా చేసింది. దాంతో రాష్ట్రాల దగ్గర ప్రస్తుతం 1.84 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అన్ని రాష్ట్రాలకు కలిపి మరో 51 లక్షల వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది. తెలంగాణకు ఇప్పటివరకు మొత్తం 61,41,040 డోసుల సరఫరా జరిగింది. వాటిలో ఇప్పటి వరకు  54,47,541 డోసుల వ్యాక్సిన్లను ప్రభుత్వం వినియోగించింది. దాంతో తెలంగాణ దగ్గర మరో 6,93,499 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.