11న బల్దియా మీటింగ్..కార్పోరేటర్లకు సూచనలివే..

11న బల్దియా మీటింగ్..కార్పోరేటర్లకు సూచనలివే..

ఈ నెల 11న జరిగే బల్దియా మీటింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీలో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్ల ప్రమాణ  స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు 11 న జరిగే సమావేశానికి హాజరు కావడానికి పలు సూచనలను చేశారు హెచ్ఎంసీ ఎన్నికల అధికారి.

సూచనలు

  • 11 వ తేదీ ఫిబ్రవరి 10:45 గంటల వరకు కౌన్సిల్ హాల్ కు చేరుకోవాలి.
  • ప్రతీ సభ్యుడు తమ ఫోటో కలిగిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాల్సి ఉంటుంది.
  •  సమావేశం నిర్వహణను తెలియ చేస్తూ ఇప్పటికే జీహెచ్ఎంసీ పంపిన లేఖను కూడా సభ్యులు తీసుకురావాలి.
  • ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వ హించడం జరుగుతుంది.
  •  కేవలం సభ్యులను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. బంధువులను గాని, అనుచరులను గానీ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.
  • సమావేశానికి హాజరయ్యే ప్రతీ సభ్యులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలి. మాస్క్ లను ధరించాలి.
  •  కౌన్సిల్ హాల్ లో పార్టీల ప్రాతిపదికగా సభ్యులకు తమ వార్డుల పేర్లను తెలియచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అక్షర క్రమంలో సీట్ల కేటాయింపు.
  •  ప్రతి లైన్ లో సహాయకారిగా ఉండేందుకు రో-అధికారుల నియామకం.
  •  ప్రతి సభ్యుడు ఏ సీటులో కూర్చోవాలో ఈ అధికారులు తెలియజేస్తారు.
  •  11వ తేదీన నిర్వహించే సమావేశంపై ఏదైన సందేహాలు ఉంటే జిహెచ్ఎంసి ఎన్నికల విభాగం అధికారులను గానీ, సెక్రటరిని గాని సంప్రదించవచ్చు.
  •  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పక్రియ నిర్వహణపై వివరించేందుకు 9న.. జిహెచ్ఎంసిలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది.