మోడీ బయోపిక్ మళ్లీ ఆగింది

మోడీ బయోపిక్ మళ్లీ ఆగింది

ప్రధాని మోడీ బయోపిక్ రిలీజ్ మళ్లీ ఆగింది. ఏప్రిల్-11న రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే బుధవారం సినిమా ప్రివ్యూ చూసిన ఎన్నికల సంఘం .. మూవీ రిలీజ్ చేయరాదని తెలిపింది.  దీంతో గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయింది.  ఎన్నికల వేళ ఈ సినిమాను ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించింది. అయితే ఎన్నికలు అయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రతో ‘పీఎం నరేంద్రమోడీ’ పేరుతో రూపొందిన ఈ సినిమాలో వివేక్‌ ఒబరాయ్‌ మోడీ పాత్ర పోషించాడు. బయోపిక్‌ పై కొన్ని అభ్యంతరాలు రావడంతో.. ఈసీ ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మోడీ బయోపిక్ ను ఫైనల్ గా ఏప్రిల్-19న రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.