బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ తివారీగా నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' (The Family Man) వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తూనే, దేశాన్ని కాపాడే టాప్ సీక్రెట్ ఏజెంట్‌గా మనోజ్ బాజ్‌పాయ్ అద్భుత నటనతో మెప్పించారు. అయితే, ఈ సిరీస్ వెనుక ఒక ఊహించని క్రేజీ సీక్రెట్ దాగుంది. ఈ రోల్‌లో మనోజ్ బాజ్‌పాయ్ కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించాల్సిందన్న విషయం బయటకు వచ్చింది.
'ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ ఛాయిస్ మెగాస్టార్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ సిరీస్ క్రియేటర్ రాజ్ నిడిమోరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 'ఫ్యామిలీ మ్యాన్' కథకు మా ఫస్ట్ ఛాయిస్ మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ను పండించగల స్టామినాను మనసులో పెట్టుకునే ఈ కథను రాసుకున్నాం అని రాజ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
సినిమా కథను వెబ్ సిరీస్‌గా..
మొదట్లో దీనిని వెబ్ సిరీస్‌గా కాకుండా, ఒక భారీ థియేట్రికల్ ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాలని రాజ్ అండ్ డీకే ప్లాన్ చేశారు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కాలంలో కథలో మార్పులు చేసి.. లెంత్ పెంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అనుగుణంగా వెబ్ సిరీస్‌గా మార్చారు. అలా మెగాస్టార్ చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్తా మనోజ్ బాజ్‌పాయ్ చేతుల్లోకి వెళ్ళిందని రాజ్ చెప్పుకొచ్చారు.
రికార్డు స్ఘాయిలో..
2019లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ప్రియమణి, షరీబ్ హష్మీ, అస్లేషా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్, హాలీవుడ్ స్పై యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ముఖ్యంగా సీజన్ 2లో సమంత నెగెటివ్ షేడ్ ఉన్న రోల్‌లో నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
►ALSO READ | Weekend OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. యాక్షన్, సస్పెన్స్ , కామెడీ చిత్రాల ఫుల్ లిస్ట్ ఇదే!
సీజన్ 4 పై క్రేజీ అప్‌డేట్...
ఇక ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పారు రాజ్.. ఈ ఫ్రాంచైజీ ఇక్కడితో ఆగిపోవడం లేదు. మా దగ్గర చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పటివరకు చూసింది కేవలం మిడ్‌పాయింట్ మాత్రమే అని రాజ్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం సీజన్ 3 పనులు శరవేగంగా జరుగుతుండగా, సీజన్ 4 కూడా అనుకున్నదానికంటే చాలా త్వరగానే రాబోతోంది అంటూ రాజ్ నిడిమోరు ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి కనుక ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే బాక్సాఫీస్ ఎలాంటి రికార్డులు సృష్టించేవారో..
