టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించి మూవీ ఆడియెన్స్‌కు దగ్గరైంది. మొన్నామధ్య ఒక సూపర్‌హిట్ స్పెషల్ సాంగ్‌లో కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు ‘మేడ్ ఇన్ కొరియా’తో సోలో హీరోయిన్‌గా కొత్త మలుపు తీసుకుంది. ఆమెవరో కాదు.. ప్రియాంక అరుల్ మోహన్. ఇంజనీరింగ్ చదివిన బెంగళూరు అమ్మాయి ఎలా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది?
ప్రియాంక అరుల్ మోహన్ బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి తమిళుడు, తల్లి కన్నడిగ. దీంతో ప్రియాంక తమిళం, కన్నడ నేర్చుకుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు కూడా నేర్చుకుంది. ఓ సందర్భంలో ఆమె ఫ్యామిలీ గురించి చెప్తూ.. ‘‘నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. కానీ మా కుటుంబం చాలా సపోర్టివ్. కాలేజీ రోజుల్లోనే ఆర్ట్స్ పై ఇంట్రెస్ట్ ఉండేది. అది చూసి నా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు” అంది.
మొదటి చాన్స్..
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా స్టేజీ నాటకాలు చేసేది. ఒకసారి క్యాజువల్‌గా ఫొటో షూట్ జరిగింది. ఆ ఫొటోలు చూసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు అవకాశం ఇచ్చారు. 2019లో కన్నడ చిత్రం ‘ఓంధ్ కథే హెల్లా’తో డెబ్యూ చేసింది. అదే సంవత్సరం నాని ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డెబ్యూ సినిమాతోనే పెద్ద బ్రేక్ వచ్చింది. అప్పటినుంచి తెలుగు, -తమిళ ఇండస్ట్రీల్లో ఫిక్స్ అయిపోయింది.
ఇది నా గ్రాఫ్ మార్చేస్తుంది
‘గ్యాంగ్ లీడర్’ తర్వాత తమిళ్‌లో ‘డాక్టర్’ సినిమాలో చేసిన పాత్రకు సైమా అవార్డు దక్కింది. ‘డాన్’, ‘ఎతర్కుం తునింధవన్’, ‘కెప్టెన్ మిల్లర్’, ‘సరిపోదా శనివారం’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నటించింది. పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’లో కన్మణి రోల్ చేసింది. అది ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. “రెండున్నర సంవత్సరాలు ఈ సినిమా కోసం పనిచేశా. పవన్ గారి నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన ఆఫ్ స్క్రీన్‌లో కూడా రియల్ హీరోనే. ఇన్నేళ్లలో నేను చేసిన సినిమాల్లో నా ఫేవరెట్ రోల్ ఇదే” అని ఎమోషనల్‌గా చెప్పింది.
సోలో లీడ్
ఇప్పుడు ‘మేడ్ ఇన్ కొరియా’లో సోలో లీడ్‌గా నటించింది. ఇందులో ఆమె షెన్బా రోల్ చేసింది. దాని గురించి ఇలా వివరించింది. “షెన్బా పాత్ర డ్రీమ్ ఆఫ్ కొరియా క్యూరియాసిటీ నుంచి వచ్చింది. ఫస్ట్ నెరేషన్ నుంచే స్టోరీతో నేను డీప్‌గా కనెక్ట్ అయ్యాను. ఈ క్యారెక్టర్ నాకు చాలా పర్సనల్. పాత్రకు తగ్గ ఎమోషన్స్ అన్నీ ప్రదర్శించడం చాలెంజింగ్‌గా అనిపించింది. కానీ నాకు అది ఒక రివార్డ్ లాంటిది. షూటింగ్ టైంలో కొరియాలో దాదాపు నెలన్నర రోజులు ఉన్నా. నేను కూడా షెన్బా లాగే కొత్త కల్చర్ నేర్చుకున్నా. కొరియన్ నటీనటులు, టెక్నిషీయన్లు.. ముఖ్యంగా స్క్విడ్ గేమ్ మూవీ యాక్టర్‌తో కలిసి వర్క్ చేయడం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా కేవలం ఎంటర్‌టైనర్ కాదు. కొరియాకు వెళ్లాలని కలలు కనే ప్రతి ఇండియన్ గర్ల్‌కి ఇన్‌స్పిరేషన్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకోవడానికి కారణం.. ఇప్పటివరకు చాలా స్క్రిప్టులు వచ్చాయి. కానీ ఇలాంటి డిఫరెంట్ సినిమా కావాలని ఎదురుచూశాను. ఇలాంటి పాత్రలు తక్కువగా వస్తాయి. నాకు ఈ అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా. ఇంకా ఎన్నో విభిన్న పాత్రలు చేయాలని ఉంది” అని చెప్పింది.
సక్సెస్‌తోపాటు సవాళ్లు..
ప్రియాంకకు తన జర్నీలో సక్సెస్‌తోపాటు ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఒకటైంలో ఆమెపై ఆన్‌లైన్‌లో ఆర్గనైజ్డ్ నెగటివ్ క్యాంపెయిన్, ట్రోలింగ్ మొదలైంది. ఆమె పర్ఫార్మెన్స్‌పై విమర్శలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ “ఈ ఇండస్ట్రీలో చాలా విషయాలు జరిగాయి. అవి నన్ను చాలా బాధపెట్టాయి. అవే నేను లేచి నిలబడేందుకు సాయం చేశాయి. అయితే, ఎవరూ ఇంకొకరి జర్నీని పూర్తిగా ఆపలేరు అని దాన్నుంచి ధైర్యంగా బయటపడ్డాను. ‘మేడ్ ఇన్ కొరియా’ స్క్రిప్ట్ వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ నన్ను ఈ రోల్లో అంగీకరిస్తారా? నేను ఇంకా అంత హైట్ చేరుకున్నానా? అని సందేహం వచ్చింది. కానీ ఆ సందేహాలన్నీ దాటి ఆ సినిమా చేశా” అని చెప్పింది ప్రియాంక.
