‘ఘాటి’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ‘పుట్టగానే బెమ్మ ముడిపెట్టెరో’ అంటూ సాగే ఫోక్ వెడ్డింగ్ సాంగ్‌‌

‘ఘాటి’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ‘పుట్టగానే బెమ్మ ముడిపెట్టెరో’ అంటూ సాగే ఫోక్ వెడ్డింగ్ సాంగ్‌‌

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు  లీడ్ రోల్స్‌‌లో  క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న  చిత్రం ‘ఘాటి’.  యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌‌తో అనుష్క ఇంటెన్స్‌‌ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘సైలోరే.. లొల్లాయి లొల్లాయి లోరే.. పుట్టగానే బెమ్మ ముడిపెట్టెరో.. వయసు తాకి జంట కట్టెరో.. బతుకునంతా తోడులోన చూసేరో.. అడుగు అడుగు మొదలు పెట్టెరో..’ అంటూ సాగే ఈ ఫోక్ వెడ్డింగ్ సాంగ్‌‌ను సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా, క్రిష్ జాగర్లమూడి ఆకట్టుకునే లిరిక్స్ అందించారు.

లిప్సిక భాష్యం, సాగర్ నాగవెల్లి, సోని  కోమండూరి కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేసింది. ఇందులో అనుష్క, విక్రమ్ కొత్తగా పెళ్లయిన జంటగా కనిపించారు. చింతకింది శ్రీనివాసరావు కథను అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. జులై 11న  సినిమా  విడుదల కానుంది.   ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌‌ కాంబినేషన్‌‌లో వస్తోన్న రెండో సినిమా కావడం,  అలాగే యూవీ క్రియేషన్స్‌‌తో అనుష్కకు ఇది నాలుగో సినిమా అవడంతో అంచనాలు ఏర్పడ్డాయి.