ది గోట్ లైఫ్‌ సెకెండ్ లుక్‌‌ రిలీజ్ చేసిన బాలీవుడ్ హీరో రణ్‌‌వీర్ సింగ్

ది గోట్ లైఫ్‌ సెకెండ్ లుక్‌‌ రిలీజ్ చేసిన బాలీవుడ్ హీరో రణ్‌‌వీర్ సింగ్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్(Prudhviraj Sukumaran) సుకుమారన్ హీరోగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ(Blessy) తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్ లైఫ్‌‌(The Goat life)’ (ఆడు జీవితం).  విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌‌ 10న పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా విడుదల కానుంది. ఇటీవల ప్రభాస్‌‌ ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేయగా, తాజాగా సెకెండ్ లుక్‌‌ను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌‌వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి, ‘ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా’ అని క్యాప్షన్‌‌ ఇచ్చాడు.

నైంటీస్‌‌లో జోవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి రియల్‌‌ లైఫ్ స్టోరీ ఇది. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  పూర్తిస్థాయిలో ఎడారిలో తెరకెక్కిన ఫస్ట్ ఇండియన్ సినిమా కావడం విశేషం.